వెన‌క్కి త‌గ్గిన భీమ్లానాయ‌క్‌.. విడుదల వాయిదా.. ఎప్పుడంటే

Bheemla Nayak postponed to Feb 25th.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు నిజంగా నిరాశ క‌లిగించే వార్త ఇది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 5:58 AM GMT
వెన‌క్కి త‌గ్గిన భీమ్లానాయ‌క్‌.. విడుదల వాయిదా.. ఎప్పుడంటే

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు నిజంగా నిరాశ క‌లిగించే వార్త ఇది. గ‌త కొద్దిరోజులుగా వినిపిస్తున్న‌ట్లుగానే భీమ్లానాయ‌క్ వెన‌క్కి త‌గ్గాడు. ద‌గ్గుబాటి రానా, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి న‌టిస్తున్న 'భీమ్లానాయ‌క్' విడుద‌ల తేదీ వాయిదా ప‌డింది. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుదల కావాల్సి ఉండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 25 కి మార్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ వెల్ల‌డించారు.

కాగా.. గ‌తంలోనూ ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ వార్త‌లు వినిపించ‌గా.. వాటిని చిత్ర నిర్మాత‌లు తోసిపుచ్చారు. దీంతో సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్ ఖ‌చ్చితంగా ఉంటార‌ని అంతా బావించారు. అయితే.. ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' నిర్మాతల రిక్వెస్ట్ మేరకు 'భీమ్లా నాయక్' ను వాయిదా వేశారని దిల్‌రాజ్ తెలిపారు. ఆ రెండు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు కావ‌డం, తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశ్యంతో.. టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాలను ఒకేసారి ప్రదర్శించేటంత స్క్రీన్స్ సంఖ్య కూడా లేదు కాబట్టి 'భీమ్లా నాయక్'ను వాయిదా వేసుకోమని పవన్ తో పాటు సినిమా నిర్మాతను కోరినట్టు దిల్ రాజు ప్రకటించారు.

ఇక స‌రిగ్గా అదే రోజు ఫిబ్ర‌వ‌రి 25, 2022న విడుద‌ల కావాల్సిన 'ఎఫ్ 3' చిత్రాన్ని ఏప్రిల్‌కు షిఫ్ట్ చేసిన‌ట్లు దిల్‌రాజ్ తెలిపారు. సంక్రాంతి నుంచి భీమ్లా నాయక్ ను షిఫ్ట్ చేసినందుకు 'ఆర్ఆర్ఆర్' మరియు 'రాధే శ్యామ్' నిర్మాతలు పవన్ కి నిర్మాత నాగవంశీ మరియు త్రివిక్రమ్ లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

Next Story
Share it