సంక్రాంతికే 'భీమ్లా నాయక్'.. తగ్గేదేలే అంటున్న ప‌వ‌ర్‌స్టార్‌

Bheemla Nayak Movie release in theatres from 12th Jan.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 6:07 AM GMT
సంక్రాంతికే భీమ్లా నాయక్.. తగ్గేదేలే అంటున్న ప‌వ‌ర్‌స్టార్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు భార్య‌గా నిత్యామీన‌న్ క‌నిపించ‌నుండ‌గా.. రానాకు జోడిగా సంయుక్త మీన‌న్ న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇంత‌క‌ముందే ప్ర‌క‌టించింది.

అయితే.. ఇటీవ‌ల 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి వెల్ల‌డించారు. ప్ర‌భాస్ న‌టించిన చిత్రం 'రాధేశ్యామ్' జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఈ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా చిత్రాలు కావ‌డం.. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్రాలు కావ‌డం, రెండింటి మ‌ధ్య తీవ్ర‌మైన పోటి ఉండ‌డంతో.. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ప‌లు చిత్రాలు వాయిదా వేసుకున్నారు. అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'స‌ర్కారు వారి పాట' కూడా ఉంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయాల‌ని బావించ‌గా.. ఏప్రిల్ 1కి వాయిదా ప‌డింది.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'భీమ్లానాయ‌క్' చిత్రం కూడా వాయిదా ప‌డుతుంది అని అంతా బావించారు. ఫిబ్ర‌వరికి వాయిదా ప‌డింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేద‌ని.. సంక్రాంతి బ‌రిలోనే తాము ఉన్నామ‌నే విష‌యాన్ని చిత్ర బృందం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. తగ్గేదేలే అంటూ కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. మ‌రీ వారం రోజుల వ్య‌వ‌ధిలో మూడు అల్టిమేట్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. మ‌రి వీటిలో ఏ చిత్రం బ్లాక్‌బాస్ట‌ర్‌గా నిల‌వ‌నుందో చూడ‌లి మ‌రీ.

Next Story
Share it