భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ పిక్ వైరల్..

Bheemla Nayak and Daniel Shekar pic goes viral.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్ లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2021 4:05 PM IST
భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ పిక్ వైరల్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'. మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప‌వ‌న్.. డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో రానా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్యామీన‌న్ న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ప‌వ‌న్, రానాపై పైట్ సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. పవన్ నులకమంచం మీద, రానా ఎద్దులబండి మీద పడుకుని ఉన్న పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చుట్టూ మార్కెట్ సెట్ ఉండగా, పవన్ షర్ట్ కు రక్తం, గాయమైనట్టుగా ఫొటోలో కన్పిస్తోంది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Next Story