Video: గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న 'రజాకార్' మూవీ బతుకమ్మ పాట

హైదరాబాద్ సంస్థానంలోని నిజాం ప్రభుత్వానికి చెందిన రజాకార్ వ్యవస్థ పాల్పడిన అకృత్యాలను, దారుణాలను వెండితెరపై చూపించబోతున్న సినిమా 'రజాకార్'.

By అంజి  Published on  11 Oct 2023 3:20 AM GMT
Bharathi Bharathi Uyyalo, Razakar movie, Anasuya, Tollywood

Video: గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న 'రజాకార్' మూవీ బతుకమ్మ పాట

హైదరాబాద్ సంస్థానంలోని నిజాం ప్రభుత్వానికి చెందిన రజాకార్ వ్యవస్థ పాల్పడిన అకృత్యాలను, దారుణాలను వెండితెరపై చూపించబోతున్న సినిమా 'రజాకార్'. ఈ సినిమాను యాటా సత్యనారాయణ రచన, దర్శకత్వం అందించారు. కాగా ఈ సినిమాపై ఇప్పటికే చాలా వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని పలువురు ప్రముఖులు విమర్శించారు. అయితే ఈ మూవీకి బీజేపీ మాత్రం సపోర్ట్‌ చేస్తోంది. తెలంగాణ చరిత్రలో భాగమైన రజాకార్ వ్యవస్థ గురించి నేటి తరానికి తెలియజేసేందుకు ఈ సినిమా తీస్తున్నామని చిత్రయూనిట్‌ చెబుతోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి 'భారతి భారతి ఉయ్యాలో' అంటు సాగే బతుకమ్మ పాటను రిలీజ్‌ చేశారు.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌ అందించారు. మోహన భోగరాజు, భీమ్స్ సిసిరోలియో, స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటలో అనసూయ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ పాట కొనసాగుతుంది. ఈ సినిమాని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌ పాండే కీలక పాత్రలు పోషించారు. 'రజాకార్‌' సినిమాను పొలిటికల్‌ యాంగిల్‌లో చూడొద్దని, సినిమాని సినిమాగానే చూడాలని, ఇది ఏ పార్టీకి మేలు చేసేలా ఉండదని, దీంట్లో వాస్తవంగా జరిగిన చరిత్రను చూపించారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు.

Next Story