క్రికెట్ ఆడుతూ న‌టుడు మృతి

Bhabiji Ghar Par Hai's Malkhan Aka Deepesh Bhan Passes Away Aged 41.సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2022 2:52 PM IST
క్రికెట్ ఆడుతూ న‌టుడు మృతి

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు, క‌మెడియ‌న్ దీపేష్ భాన్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 41 సంవ‌త్స‌రాలు. శ‌నివారం ఉద‌యం త‌న స్నేహితుల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతున్న దీపేష్.. ఉన్న‌ట్లుండి ఒక్క సారిగా కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. దీపేష్‌ మృతికి పలువురు సినీ, టీవీ నటీనటులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కవిత కౌశిక్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియ‌జేశారు. దీపేష్‌ హఠ్మారణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీపేష్‌ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు కూడా లేవంటూ భావోద్వేగానికి లోన‌య్యారు.

దీపేష్ భాన్ కెరీర్ విషయానికి వస్తే.. 'భాభి జీ ఘర్ పర్ హై' అనే టీవీ షోలో మల్ఖాన్ సింగ్ పాత్రతో మంచి గుర్తింపు పొందారు. ఆ త‌రువాత 'కామెడీ కా కింగ్ కౌన్', 'కామెడీ క్లబ్', 'భూత్వాలా', 'ఎఫ్ఐఆర్' వంటి అనేక హాస్య కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల మ‌న‌స్సుల్లో చ‌ద‌ర‌ని ముద్ర వేశాడు.

Next Story