24 ఏళ్ళకే కన్నుమూసిన స్టార్ హీరోయిన్

Bengali actress Aindrila Sharma passes away at the age of 24. బెంగాలీ స్టార్ హీరోయిన్ అండ్రిలా శర్మ ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించింది.

By M.S.R  Published on  20 Nov 2022 5:06 PM IST
24 ఏళ్ళకే కన్నుమూసిన స్టార్ హీరోయిన్

బెంగాలీ స్టార్ హీరోయిన్ అండ్రిలా శర్మ ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించింది. 24 ఏళ్ళ అండ్రిలా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1 న కోల్ కత్తా లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటుంది. చాలా సార్లు గుండెపోటుకు గురైన 24 ఏళ్ల అండ్రిలా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్ కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. నవంబర్ 1న ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. హౌరాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు మెదడులో రక్తస్రావం అయ్యిందని దీంతో ఆమె కోమాలోకి వెళ్లడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. కొద్దిరోజులుగా కోమాలో ఉన్న అండ్రిలా ఈరోజు మరణించిందని వైద్యులు ధృవీకరించారు. మొత్తం 10సార్లు ఆమెకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అండ్రిలా మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

యువనటి మరణంతో బెంగాలీ పరిశ్రమ తీవ్ర విషాదంలో ఉంది. ఇక అండ్రిలా టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్ గా మారింది. అమీ దీదీ నెం 1, లవ్ కేఫ్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయింది. అండ్రిలా రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడింది.. ఇటీవల వరుస గుండెపోటులు ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. 2015లో ఇంటర్ చదువుతున్న సమయంలో తొలిసారిగా అండ్రిలా క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత 2021 లో మరోసారి ఊపిరితిత్తులో క్యాన్సర్ ఏర్పడింది. క్యాన్సర్ తో పోరాడుతూనే నటన కొనసాగించింది.


Next Story