ఏ రంగంలోనైనా నెంబర్.1 బాలయ్యే: నారా లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Knakam Karthik
ఏ రంగంలోనైనా నెంబర్.1 బాలయ్యే: నారా లోకేశ్
హైదరాబాద్: చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బాలకృష్ణకు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... 50 ఇయర్స్ ఇండస్ట్రీ. సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోస్, పాలిటిక్స్ ఎందులోనైనా బాలయ్య నంబర్ 1. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి తరువాత రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క మాస్ మహారాజ్ బాలయ్య. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మాస్ మహారాజ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 1974లో తాతమ్మ కలతో మొదలైన సినీ ప్రయాణం అఖండ 2 వరకూ వచ్చింది. అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్య కు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికి 109 సినిమాల్లో హీరోగా చేశారు. 100 రోజులు కాదు 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి.
ఏదైనా బాలయ్యకే సాధ్యం
ఎవరైనా ఒక జానర్ లో సక్సెస్ అవుతారు. కానీ అన్ని జానర్స్ లో సినిమాలు తీసి ముద్ర వేసిన కథానాయకుడు బాలయ్య. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సోషియో ఫాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా బాలయ్య కే సాధ్యం. గౌతమీ పుత్రశాతకర్ణి అని మీసం మెలేసినా ....అఖండ అని గర్జించినా బాలయ్యకే చెల్లింది. రాముడు, కృష్ణుడులో మనకు తెలిసిన రూపం నందమూరి తారక రామారావు గారిది. మళ్లీ అంతటి చూడచక్కని రూపం, నట విశ్వరూపం బాలయ్య బాబుదే. శ్రీరామ రాజ్యం చిత్రంతో మళ్లీ మనందరికీ మరోసారి ఎన్టీఆర్‌ని గుర్తుకు తెచ్చారు.