ఎవ్వరిని నమ్మొద్దంటూ బండ్ల గణేష్ ట్వీట్.. ఎవరి గురించి..?
Bandla Ganesh Tweet Please don't believe anyone.బండ్ల గణేష్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు
By తోట వంశీ కుమార్
బండ్ల గణేష్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనదైన శైలిలో రాణిస్తున్నారు. తనకు ఏం అనిపిస్తే అది చెప్పేస్తుంటారు. పక్కన ఎవరు ఉన్నారు అనేది కూడా పట్టించుకోరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గణేష్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.
"జీవితం చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా.. దయచేసి ఎవరిని నమ్మకండి..! ఎవ్వరు మనకు సహాయం చేయరు. ఎవరు మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది ఇంకో బొమ్మ. ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే. కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మీ అందరికి చెబుతున్నా.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరినైనా నమ్మామా.. మన గొంతు మనం కోసుకున్నట్టే.. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి. మీ శక్తితో మీరు పోరాడండి. ఎంత పెద్దోడైన గౌరవించండి కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి." అని హిత బోధ చేశారు బండ్ల గణేష్.
జీవితం చాలా చిన్నది,
— BANDLA GANESH. (@ganeshbandla) December 20, 2022
ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా.. దయచేసి ఎవరిని నమ్మకండి..! ఎవ్వరు మనకు సహాయం చేయరు,
ఎవరు మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది ఇంకో బొమ్మ…..2
ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో తెలీదు గానీ ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటీజన్లు స్పందిస్తున్నారు. ఏమైంది అన్నా ఇలా ఎందుకు పెట్టావు అని ఒకరు ట్వీట్ చేయగా, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు..? అని ఇంకొకరు అన్నారు. ఏం జరిగింది అనేది బండ్ల గణేష్ చెబితే గాని తెలీదు.