వకీల్ సాబ్ టికెట్ రేట్ల వివాదంపై బండ్లన్న ఎంట్రీ..!

Bandla Ganesh About Vakeel Saab Ticket Price Hike. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారంలో కొనసాగుతున్న వివాదంపై బండ్ల గణేష్ స్పందించారు.

By Medi Samrat  Published on  11 April 2021 3:55 PM IST
Bandla Ganesh

పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్ లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. గతంలో కూడా ఎన్నో ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇక పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శించినా కూడా బండ్ల గణేష్ అసలు తగ్గరు. ఇంతకు ముందు కూడా చాలా మంది మీదకే బండ్ల గణేష్ వెళ్లారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారంలో కొనసాగుతున్న వివాదంపై స్పందించారు.

వకీల్ సాబ్ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో ఓపెనింగ్ కలెక్షన్స్‌పై ప్రభావం పడుతోంది. అయితే సినిమా వేరు, రాజకీయం వేరు కదా అనే చర్చ జరుగుతోంది. వకీల్ సాబ్ ఇష్యూపై ఓ మీడియా సంస్థ రాసిన ఆర్టికల్ షేర్ చేస్తూ 'వకీల్‌ సాబ్‌.. ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా?' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతానికి వకీల్ సాబ్ టికెట్ల పంచాయతీ కొనసాగుతూ ఉండగా.. బండ్ల గణేష్ ఎంట్రీ తో ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

వకీల్ సాబ్ టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లను పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆన్ లైన్ లో ఆదివారం వరకు బుక్ అయిన టికెట్లకు వర్తించదని పేర్కొంది. బెనిఫిట్ షోలు ప్రదర్శించరాదని, టికెట్ రేట్లు పెంచవద్దని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచితే కఠిన చర్యలు తప్పవంటూ ఓ జీవో కూడా తీసుకురావడంతో వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ మూడ్రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వకీల్ సాబ్ టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.



Next Story