బాలయ్య - అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ అండ్ లాంచింగ్ డేట్ ఫిక్స్ !

Balayya - Anil Ravipudi movie shooting and launching date fixed. నటసింహం బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమా లాచింగ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 8వ తేదీన పూజా

By Sumanth Varma k  Published on  21 Nov 2022 7:38 AM GMT
బాలయ్య - అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ అండ్ లాంచింగ్ డేట్ ఫిక్స్ !

నటసింహం బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమా లాచింగ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 8వ తేదీన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. అర్జున్ రాంపాల్ కూడా బాలయ్యకి విలన్ గా నటించడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

మరోపక్క బాలయ్య ఫ్యాన్స్ అనిల్ రావిపూడి పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. బాలయ్యతో అనిల్ తన సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ?, ఎప్పుడు క్లోజ్ చేస్తాడు ? అని బాలయ్య అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఎదురు చూపులకు డిసెంబర్ 8న సమాధానం దొరకనుంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా బాలయ్య తన కెరీర్‌లో తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ప్రచారమే నిజమైతే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇక దబిడి దిబిడే అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు.

అన్నట్లు ప్రస్తుతం ఈ సినిమా టీమ్ హీరోయిన్ పాత్ర కోసం కూడా వెతుకుతుంది. బాలయ్య పక్కన హీరోయిన్ అంటే.. థర్టీ ప్లస్ అయితేనే బాగుంటుంది. మరి అనిల్ రావిపూడి ఏ హీరోయిన్ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక అఖండ త‌ర‌వాత‌.. బాలయ్య బాబు తిరుగులేని ఫామ్ లోకి వ‌చ్చేశాడు.

Next Story
Share it