రేపే.. 1000 థియేటర్లలో 'నరసింహ నాయుడు'

Balakrishna's 'Narasimha Naidu' is to be re-released in over 1000 theatres on account of his 64th birthday. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా 'నరసింహ నాయుడు'.

By M.S.R  Published on  9 Jun 2023 4:21 PM IST
రేపే.. 1000 థియేటర్లలో నరసింహ నాయుడు

Balakrishna's 'Narasimha Naidu' is to be re-released in over 1000 theatres on account of his 64th birthday


నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా 'నరసింహ నాయుడు'. బి.గోపాల్ దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2001లో విడుదలై రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇందులో బాలయ్యకు జోడిగా సిమ్రాన్, ప్రీతి జింగ్యాని నటించగా.. ఫ్లోరా షైని కీలకపాత్రలో కనిపించింది. ఈ సూపర్‌హిట్‌ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 10న 4కె వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఏకంగా 1000 థియేటర్లలో విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో రీరిలీజ్ జరగలేదు. ఇప్పుడు రీరిలీజ్ లో కూడా నందమూరి బాలకృష్ణ సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తోంది.

చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ మాట్లాడుతూ.. నరసింహనాయుడు నాకెరీర్‌లో మరచిపోలేని చిత్రం. బాలయ్య అద్భుతంగా నటించారు. ఎమోషన్స్‌, యాక్షన్‌ పరంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తీరు మరచిపోలేను. కత్తులతో కాదురా… కంటి చూపులతో చంపేస్తా అన్న డైలాగ్‌ బాలయ్య చెబితేనే బావుంటుంది. ఆ డైలాగ్‌ను ఇప్పటికీ జనాలు మరచిపోలేదు. కథ, పరుచూరి బ్రదర్స్‌ ఇచ్చిన డైలాగ్స్, పాటలు, డాన్స్‌లు, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయని అన్నారు. నరసింహనాయుడు చరిత్ర సృషించిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత ప్రసన్నకుమార్‌ చెప్పుకొచ్చారు.


Next Story