డాకు మహారాజ్.. మొదటి రోజు వసూళ్ల వివరాలివే!!

డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన ఓపెనింగ్స్ సాధించింది.

By అంజి  Published on  13 Jan 2025 1:45 PM IST
Balakrishna, Daku Maharaj, first day collections, Tollywood

డాకు మహారాజ్.. మొదటి రోజు వసూళ్ల వివరాలివే!! 

డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం ముందస్తు బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీగా వాక్-ఇన్‌లను చూసింది. సినిమాకు మొదటి ఆట నుండి హిట్ టాక్ రావడంతో మధ్యాహ్నం, ఈవెనింగ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

డాకు మహారాజ్‌ సినిమాకు వీరసింహారెడ్డిని మించి బాలకృష్ణకు బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ దక్కింది. చాలా స్క్రీన్‌లు, షోలు జోడించడంతో ఈ చిత్రం సెకండ్ షోలకు సంబంధించి భారీ జంప్‌ను సాధించింది. హౌస్‌ఫుల్‌లను నమోదు చేయడంతో పాటూ మరిన్ని స్క్రీన్‌లలో డాకూ మహారాజ్ సినిమాను పెంచాలనే డిమాండ్ కూడా లభించింది.

ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ టార్గెట్ రూ.80 కోట్లు, మొదటి రోజునే దాదాపు 40% రికవరీ చేసింది. పండుగ సెలవులు ముగిసే సమయానికి సినిమా లాభాల్లోకి వచ్చేయడం కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. బాలకృష్ణ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా డాకూ మహారాజ్ నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story