'బాలయ్య 108' పోస్ట్ ఫోన్

Balakrishna Movie Postponed. నటసింహం నందమూరి బాలకృష్ణ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో

By Sumanth Varma k  Published on  21 Feb 2023 3:53 PM IST
బాలయ్య 108 పోస్ట్ ఫోన్

నటసింహం నందమూరి బాలకృష్ణ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. కానీ తారకరత్న మరణం కారణంగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పొన్ చేశారు. రెండు వారాల తర్వాత షూట్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. బాలయ్య కోసం తాను తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సబ్జెక్ట్ ను రాసినట్లు అనిల్ రావిపూడి ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. దాంతో బాలయ్య తెలంగాణ మాండలికంలో డైలాగ్ లు చెబితే ఎలా ఉంటుందో చూడాలి.

అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట. ఐతే, బాలయ్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయట. అలాగే సినిమాలో ఫాదర్ - కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ప్లాష్ బ్యాక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. మొత్తానికి అనిల్ - బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.





Next Story