స్టేజ్‌పై తోసేసిన బాలయ్య.. వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన అంజలి

స్టేజ్‌పై అంజలిని బాలకృష్ణ నెట్టేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. వివాదానికి తెరతీసింది.

By Srikanth Gundamalla  Published on  31 May 2024 10:35 AM IST
balakrishna, anjali, controversy,  tollywood ,

స్టేజ్‌పై తోసేసిన బాలయ్య.. వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన అంజలి 

టాలీవుడ్‌ మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి'. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా.. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ పాల్గొన్న విషయం కూడా తెలిసిందే. అయితే.. స్టేజ్‌పై బాలకృష్ణ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనతో పాటు నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని ఆయన ఒక్కసారిగా వెనక్కి నెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

నెటిజన్లు.. పలువురు ప్రముఖులు ఈ వీడియోపై స్పందిస్తూ కామెంట్స్ చేశారు. బాలయ్య తీరు ఏమాత్రం బాగోలేదని చెప్పుకొచ్చారు. కొందరైతే ఏకంగా విమర్శలు చేశారు. అయితే.. బాలయ్య తోసేసినా కూడా అంజలి నవ్వుతూ కవర్‌ చేసేసింది. అయినా కూడా బాలకృష్ణపై ట్రోల్స్‌ కొనసాగాయి. వివాదానికి తెరలేసింది. ఈక్రమంలోనే తాజాగా ఈ అంశంపై అంజలి స్పందించింది. తాజాగా ఆమె చేసిన ఒకేఒక ట్వీట్ అందరినీ కూల్ చేసింది.

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈవెంట్‌ను తన సమక్షంలో నిర్వహించినందుకు నందమూరి బాలకృష్ణకు అంజలి ధన్యవాదాలు తెలిపారు. బాలకృష్ణ, తనకు ఒకరి పట్ల మరొకరికి పరస్పర గౌరవం ఉందని ట్వీట్‌లో రాసుకొచ్చారు. చాలా కాలం ముందు నుంచే గొప్ప స్నేహాన్ని పంచుకుంటున్నామని అంజలి చెప్పింది. మళ్లీ ఆయనతో వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని అంజలి పేర్కొంది. ఈ క్రమంలోనే బాలయ్యతో సరదాగా చేసిన చిట్‌చాట్‌ విజువల్స్‌ను కూడా వీడియోను అంజలి షేర్ చేసింది. అంజలి తాజాగా చేసిన ట్వీట్‌తో ఈ వివాదానికి పరోక్షంగా తెరపడినట్లు అయ్యింది.


Next Story