ప్రముఖ కిన్నెర కళాకారుడు, బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల వరంగల్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం చనిపోయారు. బలగం సినిమాలో చివరి సన్నివేశంలో భావోద్వేగభరిత 'తొడుగ మా తోడుండి' పాటను ఆలపించి కంటతడి పెట్టించిన మొగిలయ్య అందరి మన్ననలు పొందారు. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి.
అంతకుముందు మొగిలయ్య చికిత్సకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మెగాస్టార్ చిరంజీవి, బలగం సినిమా దర్శకుడు వేణు సైతం ఆర్థిక సాయం చేశారు. ఇటీవల మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మొగిలయ్యను వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మొగిలయ్య కన్నుమూశాడు. భీమ్లా నాయక్, బలగం సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన మొగిలయ్య మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.