ఏకంగా 200 కోట్ల నష్టాన్ని మిగిల్చిన సినిమా

గత వారం బాలీవుడ్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. రెండు భారీ సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి

By Medi Samrat  Published on  16 April 2024 4:30 PM IST
ఏకంగా 200 కోట్ల నష్టాన్ని మిగిల్చిన సినిమా

గత వారం బాలీవుడ్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. రెండు భారీ సినిమాలు బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ప్రేక్షకులు ఆ సినిమాను చూడడానికి ఏ మాత్రం మొగ్గు చూపలేదు. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్. పెద్ద ఎత్తున ప్రమోషన్లు జరిగినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టించలేకపోయింది. చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారాంతంలో ఈ సినిమా భారతదేశంలో 39 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో 3 మిలియన్లు వచ్చాయి. ఇక సోమవారం నుండి ఈ సినిమాకు సరైన కలెక్షన్స్ రావడం లేదు. ఈ చిత్రం కేవలం రూ. 2 కోట్ల నెట్ వసూళ్లను సోమవారం సాధించింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం కారణంగా నిర్మాతలకు 200 కోట్లకు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Next Story