వామ్మో.. 'బేబీ' సినిమా ఇంత విధ్వంసమా.!
జూలై 14న థియేటర్లలో విడుదలైన బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
By M.S.R Published on 26 Aug 2023 2:44 PM ISTజూలై 14న థియేటర్లలో విడుదలైన బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ఆహాలో ఆగస్టు 25 నుంచి బేబీ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఆహా గోల్డ్ మెంబర్స్ కి ఒక రోజు ముందు నుంచే స్ట్రీమ్ అయింది. బేబీ సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తెగ చూసేస్తున్నారు. థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించిన బేబీ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డ్స్ సృష్టిస్తోంది. బేబీ సినిమా ఆహాలోకి వచ్చిన 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ విషయాన్ని ఆహా టీం అధికారికంగా తెలిపింది. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది అతిపెద్ద హిట్‌లలో ఒకటైన సినిమా బేబీ. ఈ చిత్రం జూలై 14, 2023న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. సాయి రాజేష్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటి యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవ్వడంతో కాసుల వర్షం కురిపించింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ బేబీని నిర్మించారు. ఈ చిత్రంలో హర్ష చెముడు, నాగ బాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తనలు కీలక పత్రాలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.