గుడ్‌న్యూస్ చెప్పిన బాహుబలి నిర్మాత..'ది కన్‌క్లూజన్' రీ రిలీజ్‌ ప్రకటన

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా 'బాహుబలి'ని రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

By Knakam Karthik
Published on : 28 April 2025 6:47 PM IST

Cinema News, Tollywood, Baahubali-2, Re-release, Indian Cinema, Pan-India Film

గుడ్‌న్యూస్ చెప్పిన బాహుబలి నిర్మాత..'ది కన్‌క్లూజన్' రీ రిలీజ్‌ ప్రకటన

తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ వ్యాప్తం చేసిన బాహుబలి-2 సినిమా రిలీజై సోమవారంతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండో భాగం 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్'పై చిత్ర బృందం అభిమానులకు ఓ తీపి కబురు అందించింది. బాహుబలి చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా 'బాహుబలి'ని రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, 'బాహుబలి 2' ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఈ ప్రత్యేకమైన రోజున, ఈ అక్టోబర్‌లో భారతదేశంలో, అంతర్జాతీయంగా 'బాహుబలి'ని రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది కేవలం రీ-రిలీజ్ మాత్రమే కాదు, మా ప్రియమైన అభిమానుల కోసం ఒక వేడుకల సంవత్సరం అవుతుంది! పాత జ్ఞాపకాలు, కొత్త విశేషాలు, కొన్ని అద్భుతమైన సర్‌ప్రైజ్‌లను ఆశించండి" అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Next Story