అవతార్‌-2 : ఇండియన్‌ బాక్సాఫీస్ వ‌ద్ద‌ అరుదైన రికార్డు

Avatar 2 Emerges As The Highest Grossing Hollywood Movie In India. భారీ బడ్జెట్ సినిమా, జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్‌-2’ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది.

By M.S.R  Published on  22 Jan 2023 4:19 PM IST
అవతార్‌-2 : ఇండియన్‌ బాక్సాఫీస్ వ‌ద్ద‌ అరుదైన రికార్డు

భారీ బడ్జెట్ సినిమా, జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్‌-2’ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. అంచనాలను అందుకోలేదని.. కేవలం విజువల్స్ మాత్రం సూపర్ అని కామెంట్లు వినిపించాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగానూ, భారత్ లోనూ కలెక్షన్స్ విషయంలో సినిమా దూసుకుపోతోంది. భారత్ లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తుంది. తాజాగా అవతార్‌-2 ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర అరుదైన రికార్డు క్రియేట్‌ చేసింది. రూ.368.20 కోట్ల వసూళ్లు సాధించి హైయెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన హాలీవుడ్ సినిమాగా రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు అవెంజర్స్ ఎండ్‌గేమ్(రూ.367) పేరిట ఉంది. ఈ రికార్డును తాజాగా అవతార్‌-2 బ్రేక్‌ చేసింది. అవతార్‌-2 వరల్డ్‌ వైడ్‌గా ఇప్పటి వరకు 1.9 బిలియన్‌ డాలర్ల వరకు కలెక్షన్‌లు రాబట్టింది.

దర్శక ధీరుడు రాజమౌళి, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ను కలుసుకున్నారు. ఆర్ఆర్ఆర్ గురించి ఇద్దరూ ముచ్చటించారు. తాను ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూశానని కామెరూన్ తెలియజేశారు. నీరు, నిప్పు, కథతో అద్భుతంగా తీశారంటూ కొనియాడారు. మ్యూజిక్ మరింత అద్భుతంగా ఉందని, ప్రతీ సీన్ ను రక్తికట్టించిందన్నారు. కొన్ని సన్నివేశాలకు లేచి నిల్చున్నానని అన్నారు. మీరే కదా సంగీతం అందించింది అంటూ పక్కనే ఉన్న ఎంఎం కీరవాణిని సైతం అభినందించారు. కామెరూన్ ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశారని ఆయన భార్య చెప్పారు. తను ఓసారి చూసి బాగుందని చెప్పి.. మళ్లీ తనతో కలిసి మరోసారి చూశారని, రెండోసారి కూడా రెప్పవాల్చకుండా చూశారని అన్నారు. భవిష్యత్తులో మీరు హాలీవుడ్ లో సినిమా తీసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని రాజమౌళికి కామెరూన్ చెప్పారు.


Next Story