సినిమా చూడ‌మంటూ.. హాఫ్ డే లీవ్‌ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

Assam CM announces half day leave for govt employees to watch The Kashmir Files.కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 7:04 AM GMT
సినిమా చూడ‌మంటూ.. హాఫ్ డే లీవ్‌ ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంపై సర్వత్రా ప్రశంసల జ‌ల్లు కురుస్తోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు ఈ చిత్రంపై వినోద‌పు ప‌న్నును తొలగించాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సైతం ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించారు.' 'ది కాశ్మీర్ ఫైల్స్' చాలా మంచి సినిమా. మీరందరూ చూడాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి'అని ప్రధాని మోదీ అన్నారు.

ఇదిలా ఉంటే.. అస్సాం ప్ర‌భుత్వం ఓ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంది. ది 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం చూసేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హాప్ డే సెల‌వును ప్ర‌క‌టించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన క్యాబినెట్ సహచరులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు.

ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. మరో వైపు సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాకి క్రేజ్ పెరగడంతో తొలి రోజు 600 స్క్రీన్లలో విడుదలైన ది కాశ్మీరీ ఫైల్స్.. ఇప్పుడు ఏకంగా 2000 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది. రూ.12 కోట్లతో తీసిన ఈ చిత్రం.. ఇప్పటికే రూ.27 కోట్లకు పైగా బిజినెస్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Next Story