విషాదం.. ఏషియన్ థియేటర్స్ అధినేత నారంగ్ కన్నుమూత
Asian Cinemas owner Narayan Das Narang passed away.తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత, ఏషియన్ మల్టీప్లెక్స్
By తోట వంశీ కుమార్ Published on
19 April 2022 5:12 AM GMT

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, నిర్మాత, ఏషియన్ మల్టీప్లెక్స్, థియేటర్స్ అధినేత నారాయణదాస్ నారంగ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు(మంగళవారం) పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు.
శ్రీవెంకటేశ్వర బ్యానర్‌లో 'లవ్‌స్టోరీ', 'లక్ష్య 'చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్, ధనుష్‌తో మరో చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్హియర్‌గా సినీ పరిశ్రమకు ఆయన సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
ఆయన భౌతిక కాయాన్ని స్వగృహానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నారాయణదాస్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు.
Next Story