పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండడానికి కూడా రెడీ అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ
Ashu Reddy stunning comments on Pawan kalyan.పవన్ వీరాభిమాని అయిన అషూ రెడ్డి షూటింగ్‌లో భాగంగా రీసెంట్‌గా పవన్ ను కలిసింది.
By తోట వంశీ కుమార్
పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం చూపించే వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. సెలెబ్రిటీలలో కూడా ఎంతో మంది పవన్ కళ్యాణ్ భక్తులే..! పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని.. పవన్ కళ్యాణ్ ను కలవాలని.. ఆయనతో ఫోటో తీయించుకోవాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నటి, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి(అశ్విని) కూడా ఒకరు. ఇప్పటికే ఆమె ఒంటిపై పవన్ కళ్యాణ్ పేరును ట్యాటూగా కూడా వేయించుకుంది. ఆమె తాజాగా పవన్ కళ్యాణ్ ను కలుసుకుంది. ఈ విషయాన్ని తన అభిమానులతో చెప్పగా.. ఓ అభిమాని ఆమెను ఓ ఊహించని ప్రశ్న అడిగాడు. అందుకు అషూ రెడ్డి కూడా అందరూ అదిరిపోయే సమాధానం చెప్పింది.
పవన్ వీరాభిమాని అయిన అషూ రెడ్డి షూటింగ్‌లో భాగంగా రీసెంట్‌గా పవన్ ను కలిసింది. పవర్ స్టార్ తో కలసి ఉన్న ఫోటోను షేర్ చేసింది అషూ. నా దేవుడిని కలుసుకున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు తన పేరుపై వేయించుకున్న టాటూ కూడా ఆయనకు గుర్తుందని చెప్పారని మురిసిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వహస్తాలతో రాసిన లెటర్ ఇచ్చారు. ఈ అవకాశం కలిగించిన డైరెక్టర్ క్రిష్‌కు కృతజ్ఞతలు అని తెలిపింది. ఫోటో, పవన్ తనకు రాసిన లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అషూరెడ్డి.
ఓ నెటిజన్ మాత్రం ఓ షాకింగ్ ప్రశ్నను అషూ రెడ్డి ముందు ఉంచారు. 'ఒకవేళ మీకు పవన్ నాలుగో భార్యగా ఉండటానికి అవకాశం వస్తే ఒప్పుకుంటారా?' అని అడిగాడు. అషూ రెడ్డి దానిపై సీరియస్‌గా తీసుకోకుండా.. "తప్పకుండా ఒప్పుకుంటానంటూ" సమాధానం చెప్పింది. అషూరెడ్డి ఇలాంటి సమాధానం చెబుతుందని తెలియక చాలా మంది నోళ్లెళ్లబెట్టారు. పిచ్చికి కూడా ఒక లిమిట్ ఉండాలంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు.