ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్‌తో పెళ్లి రద్దు.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం

Arshi khan cancels her engagement with Afghanistan Cricketer.ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఎలాంటి దారుణమైన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 2:54 PM IST
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్‌తో పెళ్లి రద్దు.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఆటగాళ్లు, చిత్ర పరిశ్రమకు చెందిన వారి భవిష్యత్తు ఏమిటా అని అందరినీ కొన్ని ప్రశ్నలు వేధిస్తూ ఉన్నాయి. అయితే క్రికెట్ కు ఎటువంటి అడ్డూ చెప్పమని తాలిబాన్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇప్పుడు ఓ ఆఫ్ఘన్ క్రికెటర్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నానని బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ ప్రకటన చేసింది. అర్షీ ఖాన్ ఈమెకు ఆప్ఘనిస్థాన్‌‌ క్రికెటర్‌ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకోవాలని భావించింది. కానీ, ఈ నిశ్చితార్థం తంతును ఆమె రద్దు చేసుకుంది. బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్ నిశ్చితార్ధం అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈ నిశ్చితార్థంను సదరు నటి క్యాన్సిల్ చేసుకుంది. నిశ్చితార్ధం ఆగిపోయినా తాము ఇద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటానమని తెలిపింది. ఆప్ఘన్‌లోని పరిణామాలే ఈ వివాహా నిశ్చితార్ధం క్యాన్సిల్ కావడానికి అసలు కారణమని తెలియజేసింది. తమ ఫ్యామిలీకి అప్ఘనిస్థాన్ మూలాలున్నాయని.. తమ కుటుంబం యూసుఫ్ జాయ్ జాతి అని తెలిపింది. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే.. భారతీయుడినే చేసుకుంటానని తెలిపింది. ఆ ఆఫ్ఘన్ క్రికెటర్ ఎవరా..? అన్నది మాత్రం అర్షీ ఖాన్ చెప్పలేదు.

Next Story