రామ్ చ‌ర‌ణ్ కోసం రెడీ అవుతున్న‌ రెహమాన్..!

మరో క్రేజీ సినిమాలో ఏఆర్ రెహమాన్ భాగమయ్యారు. రామ్ చరణ్‌- బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారని

By Medi Samrat  Published on  6 Jan 2024 9:30 PM IST
రామ్ చ‌ర‌ణ్ కోసం రెడీ అవుతున్న‌ రెహమాన్..!

మరో క్రేజీ సినిమాలో ఏఆర్ రెహమాన్ భాగమయ్యారు. రామ్ చరణ్‌- బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారని అధికారిక ధృవీకరణ వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పని చేయనున్నారు.

ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు బుచ్చి బాబు సానాతో కలిసి సినిమా చేయనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉప్పెన ఒక మ్యూజికల్ హిట్, ఇక రెహమాన్ చేరికతో బుచ్చి బాబు రెండవ చిత్రం కూడా మ్యూజికల్ చార్ట్‌బస్టర్ అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. AR రెహమాన్ భారతీయ సినిమా చరిత్రలో గొప్ప స్వరకర్తలలో ఒకరు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. అతను ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుపరిచితుడయ్యాడు.

Next Story