బాల‌య్య‌కు షాక్‌.. అనుమ‌తి నిరాక‌ర‌ణ‌.. ఈవెంట్​పై ఉత్కంఠ

AP Govt Denies Permission For Veera Simha Reddy Event.నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'వీర సింహారెడ్డి'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 8:02 AM IST
బాల‌య్య‌కు షాక్‌.. అనుమ‌తి నిరాక‌ర‌ణ‌..  ఈవెంట్​పై ఉత్కంఠ

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'వీర సింహారెడ్డి'. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 6న ఒంగోలులోని ఎబిఎం కాలేజీ గ్రౌండ్‌లో ఫ్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించాల‌ని చిత్ర బృందం బావించింది. దీంతో ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు అందుకు త‌గిన ఏర్పాట్లు చేశారు. అయితే.. పోలీసులు అక్క‌డ వేడుక‌ను నిర్వ‌హించేందుకు అనుమ‌తి నిరాక‌రించారు. వేలాది మంది అభిమానులు త‌ర‌లివ‌స్తార‌ని.. దీంతో క్రౌడ్ మ్యానేజ్‌మెంట్ సమ‌స్యాత్మ‌కం కానుంద‌ని అంటున్నారు. న‌గ‌రం మ‌ధ్య‌లో ఈవెంట్‌ను నిర్వ‌హిస్తే ట్రాఫిక్ కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతుంద‌ని, అందుక‌నే అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వేదిక‌ను మార్చుకోవాల‌ని చిత్ర‌బృందానికి పోలీసులు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో 'వీర‌సింహారెడ్డి' చిత్ర బృందం ప్ర‌త్యామ్నాయ వేదిక కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. బిఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రాంగ‌ణాన్ని సంద‌ర్శించింది. వేడుక‌ను అక్క‌డ నిర్వ‌హిస్తారా..? లేక మ‌రో చోట నిర్వ‌హిస్తారా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా చేయాల‌ని చిత్ర‌బృందం బావిస్తోంది. రెండు గంట‌ల పాటు జ‌రిగే కార్య‌క్ర‌మంలో 45 నిమిషాలు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని, నంద‌మూరి అభిమానుల‌కు క‌నుల విందుగా ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు శ్రేయాస్ మీడియా ప్ర‌తినిధి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి పిల్ల‌లు, వృద్దుల‌ను తీసుకురావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.

Next Story