అనుష్క శర్మ "చిల్డ్రన్స్ డే" స్పెషల్ డిష్.. అది చూసి మీ నోరు ఊరుతుంది.!

అనుష్క శర్మ చాలా కాలంగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉంది.

By Kalasani Durgapraveen  Published on  14 Nov 2024 3:13 PM IST
అనుష్క శర్మ చిల్డ్రన్స్ డే స్పెషల్ డిష్.. అది చూసి మీ నోరు ఊరుతుంది.!

అనుష్క శర్మ చాలా కాలంగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉంది. అయితే ప్రతిరోజూ ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం ఆమె భర్త, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో పోస్టు చేయ‌డ‌మే..

నేడు బాలల దినోత్సవం సందర్భంగా అనుష్క శర్మ తాజా పోస్ట్ బయటకు వచ్చింది. ఆమె తన కుమార్తె వామిక, కొడుకు కోసం ప్రత్యేకమైన రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తాజా పోస్ట్‌ను పంచుకుంది. బాలల దినోత్సవం సందర్భంగా అనుష్క తన పిల్లలిద్దరి కోసం ప్రత్యేకంగా నూడుల్స్ డిష్‌ను సిద్ధం చేయ‌డం ఈ పోస్ట్‌లో చూడవచ్చు.


అనుష్క ఒక గిన్నెలో ఆహారాన్ని ఉంచి చిల్డ్ర‌న్స్ డే మెనూగా తెలిపింది. ఈ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది, దీనిని ప్రజలు ఇష్టపడుతున్నారు. అనుష్క శర్మ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో ఇలాంటి ప్రత్యేక పోస్ట్‌ను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆమె తన కుమార్తె వామిక పెయింటింగ్‌కు కూడా ప్రశంసలు అందుకుంది.

ఇటీవలే నవంబర్ 5న అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సమయంలో కోహ్లి.. ఇద్దరు పిల్లల ఫోటోను అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో అనుష్క శర్మ వామిక, అకాయ్ ముఖాలను ఎమోజీలతో దాచిపెట్టింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనుష్క శర్మ తన రెండవ సంతానానికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో కాకుండా తన పిల్లలు, విరాట్‌తో కలిసి లండన్‌లో నివసిస్తోంది.

Next Story