పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్‌'. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సాగర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రానా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పాట‌ను విడుద‌ల చేయ‌గా రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ద‌స‌రా పండుగ(అక్టోబర్ 15న) సంద‌ర్భంగా 'అంత ఇష్టమేందయ్యా నీకు' అనే లిరికల్ పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అందులో భాగంగా నేడు పాట ప్రొమోను విడుద‌ల చేశారు. 33 సెక‌న్లు గ‌ల ఈ సాంగ్ ప్రొమో ఆకట్టుకుంటోంది.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో పవన్ స‌రసన నిత్యా మీనన్ నటిస్తోంది. చిత్ర షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story