నటుడు అనిల్ కపూర్, చిత్రనిర్మాత బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్ ల తల్లి నిర్మల్ కపూర్ మే 2న తుదిశ్వాస విడిచారు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా ఆమె మరణించారు. ఆమె సెప్టెంబర్ 2024లో తన 90వ పుట్టినరోజును జరుపుకుంది. గత రెండు నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రేపు ఉదయం 11:30 గంటలకు పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా లాంటి ప్రముఖులకు నాన్నమ్మ. కపూర్ కుటుంబం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి చేరుకుంది.