పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతుంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా థియేటర్లలోకి రానుండడం వల్ల మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఆ సినిమాకు భారీ ఓపెనింగ్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.
ఈ క్రమంలో తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేలా వీలు కల్పించాలని హరిహర వీరమల్లు మేకర్స్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు. అయితే మేకర్స్ విజ్ఞప్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, టికెట్ ధరలు తొలి రెండు వారాలపాటు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా, ప్రభుత్వం 10 రోజులకే అనుమతి ఇచ్చింది. ఈమేరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ జీవో విడుదల చేసింది.
ఒక్కో టికెట్‌పై అప్పర్ క్లాస్ రూ. 150 రూపాయలు, దిగువ తరగతి రూ. 100 పెరగనుంది. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ. 200 టికెట్ ప్రైజ్ హైక్ అవ్వనుంది. దీంతో పెరిగిన టికెట్ ధరతో సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ రూ. 250, సెకండ్ క్లాస్, రూ.150-190, మల్టిప్లెక్స్‌లలో రూ. 350 దాకా ఉండనుంది. కొన్ని థియేటర్లలో సౌకర్యాలు బట్టి ఈ రేట్లలో మార్పులు ఉండవచ్చు.