యాంక‌ర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. నువ్వే నా బ‌లం, బ‌ల‌హీన‌త అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Anchor Vishnu Priya mother passed away.యాంక‌ర్ విష్ణుప్రియ ఇంట విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 10:19 AM IST
యాంక‌ర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. నువ్వే నా బ‌లం, బ‌ల‌హీన‌త అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

యాంక‌ర్ విష్ణుప్రియ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె మాతృమూర్తి ఇక లేరు. గురువారం ఆమె తల్లి క‌న్నుమూసింది. ఈ విష‌యాన్ని విష్ణుప్రియ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తూ భావోద్వేగ పోస్టును పెట్టింది.

"నా ప్రియమైన అమ్మా ఈ రోజు వరకు నా పక్కన ఉన్నందుకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నిన్ను ఆరాధిస్తాను. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత కూడా. నేను తీసుకునే ప్ర‌తి శ్వాస‌లోనూ నువ్వు ఉంటావు అని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వ‌డం కోసం నువ్వు చేసిన త్యాగాల‌ను నేను ఎన్న‌టికీ మ‌రువ‌లేను. ఎప్ప‌టికీ నీకు రుణ‌ప‌డి ఉంటాను. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా." అని విష్ణు ప్రియ ఎమోష‌న‌ల్ అయ్యింది.

ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు బుల్లితెర న‌టీన‌టులు, యాంకర్లు, నెటీజ‌న్లు విష్ణుప్రియ‌కు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

విష్ణుప్రియ ఓ యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. 'పోవే పోరా' షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా అల‌రిస్తూనే వెండితెర‌పై నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటీవల విడుదలైన 'వాంటెడ్ పండుగాడు' చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది.

Next Story