యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త అరెస్ట్‌

Anchor Shyamala Husband Arrested. యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‎లో చీటింగ్ కేసు నమోదైంది.

By Medi Samrat  Published on  27 April 2021 3:42 PM IST
narasimhareddy arrested

యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‎లో చీటింగ్ కేసు నమోదైంది. కోటి రూపాయలు తీసుకుని తనను మోసం చేశాడని ఓ మహిళా ఫిర్యాదు చేసింది. 2017 నుండి విడతల వారీగా ఆ డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. డబ్బులు తిరిగివ్వ‌మ‌ని అడగడంతో నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ చెబుతోంది. బాధిత మహిళపై న‌ర్సింహ‌రెడ్డి లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఇక ఈ విష‌య‌మై సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లు బాధిత మ‌హిళ పేర్కొంది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.. నర్సింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story