అన‌సూయ సంచ‌ల‌న నిర్ణ‌యం.. నెవర్ బిఫోర్ అనే పాత్రలో‌..!

A‌nasuya to play Crucial Role In her next movie.మరో సారి అన‌సూయ నెవర్ బిఫోర్ అనే పాత్రలో న‌టించ‌డానికి సిద్ద‌మవుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Feb 2021 12:56 PM IST

A‌nasuya to play Crucial Role In her next movie

బుల్లితెర‌పై యాంక‌రింగ్‌తో పాటు వెండితెర‌పై న‌ట‌న‌లోనూ అద‌ర‌గొడుతున్న ముద్దుగుమ్మ అన‌సూయ‌. అందంతో పాటు అభిన‌యం ఆమె సొంతం. 'రంగ‌స్థ‌లం' చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి అంద‌రిచేత రంగ‌మ్మ‌త్త‌గా పిలిపించుకుంటోంది. 'పుష్ప' తో పాటు ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉంది అమ్మ‌డు. ఇలాంటీ స‌మ‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది అన‌సూయ‌. ఇప్పుడు తాజాగా మరో సారి నెవర్ బిఫోర్ అనే పాత్రలో న‌టించ‌డానికి సిద్ద‌మవుతోంది.

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కతున్నతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. రాశీ ఖన్నా, ఈషా రెబ్బా హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అన‌సూయ ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్ర ఏంటని తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. అనసూయ వేశ్య పాత్రలో నటించేందుకు అంగీకరించింది. తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ కి అనసూయ సంతకం చేయడం సంచలనమైంది. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి5 నుంచి ప్రారంభం కానుంది. జీఏ2 పిక్కర్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది.


Next Story