అమితాబ్ బాడీ గార్డు జీతం ఎంతో తెలిసి షాకవుతున్న జనం..!

Amitabh Bachchan's Bodyguard Earns Rs 1.5 Cr A Year. సెలెబ్రెటీలకు ఉండే బాడీగార్డులకు భారీగా జీతాలు ఉంటాయని తెలిసిందే..! మరీ ఈ స్థాయిలో జీతాలు

By M.S.R  Published on  27 Aug 2021 1:20 PM IST
అమితాబ్ బాడీ గార్డు జీతం ఎంతో తెలిసి షాకవుతున్న జనం..!

సెలెబ్రెటీలకు ఉండే బాడీగార్డులకు భారీగా జీతాలు ఉంటాయని తెలిసిందే..! మరీ ఈ స్థాయిలో జీతాలు ఉంటాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీ గార్డు జీతం గురించిన చర్చ జరుగుతూ ఉంది. అమితాబ్ బచ్చన్ ద‌గ్గ‌ర జితేంద్ర షిండే అనే వ్య‌క్తి కొన్నేళ్లుగా బాడీగార్డ్‌లా పని చేస్తున్నారు. ఆయ‌న అమితాబ్‌ని కంటికి రెప్ప‌లా చూసుకుంటారు. బిగ్ బీకి ఆ మ‌ధ్య క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు కరోనా కిట్ ధ‌రించి ఆసుప‌త్రికి తీసుకెళ్లాడ‌ట‌. జితేంద్ర‌కు జీతం ఏడాదికి రూ.1.5 కోట్లు అని చెబుతుంటే చాలా మంది షాక్ అవుతున్నారు. అంటే నెలకు రూ.13 లక్షల రూపాయ‌ల‌ని అంటున్నారు.

ఇంత ఆదాయంపై పోలీస్ డిపార్ట్ మెంట్ విచారణ జరుపుతోంది. ఈలోగా అతడిని దక్షిణ ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. షిండే సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నట్టు, పలువురు ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థను తన భార్య నడుపుతోందని, దాంతో తనకు సంబంధం లేదని షిండే చెబుతున్నాడు. అమితాబ్ తనకు అదనంగా ఏమీ ఇవ్వట్లేదని తెలిపాడు.

ఐదేళ్లకు మించి ఓ ప్రముఖుడి దగ్గర ఒకే బాడీగార్డ్ పనిచేయకూడదన్న నిబంధన ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, షిండే 2015 నుంచి అమితాబ్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు. అమితాబ్ కు ఎక్స్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనకు బాడీగార్డులుగా ఉంటున్నారు. అందులో షిండే అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమంటూ బిగ్ బీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అమితాబ్‌కి తోడుగా జితేంద్ర విదేశాల‌కు కూడా వెల్తూ ఉంటాడట..!


Next Story