Hyderabad: 'ప్రాజెక్ట్‌ - కె' షూట్‌లో అమితాబ్‌కు గాయం

'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో తనకు తీవ్ర గాయం అయ్యిందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు.

By అంజి  Published on  6 March 2023 12:13 PM IST
Amitabh Bachchan, Hyderabad

'ప్రాజెక్ట్‌ - కె' షూట్‌లో అమితాబ్‌కు గాయం (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌లో తన రాబోయే చిత్రం 'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో తనకు తీవ్ర గాయం అయ్యిందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. తన పక్కటెముక మృదులాస్థి విరిగిందని, ప్రస్తుతం ముంబైలోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని బిగ్ బి ఆదివారం తన బ్లాగ్‌లో పంచుకున్నారు. గాయం కారణంగా తాను పాల్గొనాల్సిన షూట్స్‌ అన్నింటీని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కాగా అమితాబ్‌ గాయపడిన విషయం తెలుసుకున్న తెగ ఆందోళన చెందుతున్నారు.

''హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో.. ఒక యాక్షన్ షాట్ సమయంలో గాయపడ్డాను. పక్కటెముక మృదులాస్థి విరిగింది. కుడి పక్కటెముకకు దెబ్బ తగిలింది. షూటింగ్ క్యాన్సిల్ అయ్యి, హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో డాక్టర్ కన్సల్ట్, సీటీ స్కాన్‌ తర్వాత చికిత్స తీసుకున్నాను. డాక్టర్లు రెస్ట్‌ తీసుకోవాలని చెప్పడంతో తిరిగి ముంబైకి వచ్చా. ఈ రోజు సాయంత్రం అభిమానులను కలవలేకపోతున్నా'' అని అమితాబ్ బచ్చన్ పోస్ట్ చేసారు.

అమితాబ్‌కు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో డాక్టర్లు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించారు. ప్రాజెక్ట్‌ కె సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, ప్రభాస్‌ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్‌ అయ్యింది. వచ్చ ఏడాది ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.

Next Story