కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న ఎన్టీఆర్
Amit Shah invites to JR NTR for lunch meet.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో చిన్న మార్పు చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2022 7:22 AM GMTకేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో చిన్న మార్పు చోటు చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కానున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరగనుంది.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా " ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం) " చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా నటించిన ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ నటనకు తాను ఇంప్రెస్ అయ్యానని, తాను ఎన్టీఆర్‌ను కలవాలనుందని అమిత్ షా తన కోరికను బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు మునుగోడు సభ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలో డిన్నర్‌కు ఆహ్వానం పంపించారు. ఈ రోజు సాయంత్రం నోవాటెల్ హోటల్‌లో అమిత్ షాతో ఎన్టీఆర్ కలవనున్నారు. ఇదే ఈ సమావేశంలో సినిమాతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా షెడ్యూల్ ఇదే..
ప్రత్యేక విమానంలో అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. 2.40 గంటలకు సికింద్రాబాద్‌లోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తారు. 3.20 గంటలకు బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్‌లో రైతు నేలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.40 గంటలకు మునుగోడులో సీఆర్ఫీఎప్ అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం 5 గంటలకు మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ముఖ్య నాయకులతో గంటకు పైగా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రి 9.40 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా.