ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. 'పుష్ప-2' వీడియో వైరల్‌

అల్లు అర్జున్ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన దినచర్య ఎలా ప్రారంభమవుతుందో తెలపడంతో పాటు ‘పుష్ప2’కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను షేర్‌ చేశారు.

By అంజి  Published on  30 Aug 2023 11:14 AM IST
Allu Arjun, Pushpa 2, instagram, Tollywood

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. 'పుష్ప-2' వీడియో వైరల్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జాతీయ చలన చిత్ర అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా సంచలన రికార్డు సృష్టించాడు. లేటెస్ట్‌గా ఇన్‌స్టా బన్నీతో ఓ వీడియో చేసింది. ఆ వీడియోను షేర్‌ చేసిన బన్నీ.. తన అభిమానులకు బిగ్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. ఆ వీడియోలో బన్నీ తన దినచర్య గురించి చెప్పాడు. మార్నింగ్‌ నిద్ర లేచిన దగ్గరి నుంచి షూటింగ్‌కు ప్యాక్‌ అప్‌ చెప్పే వరకు ఏమేం చేస్తాడో వీడియోలో వివరించాడు. వీడియోలో మొదటగా బన్నీ తన ఇంటి బయట తిరిగాడు. తన అవార్డులు, పొద్దున లేచి యోగా చేయడం, గార్డెన్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌ను చూపిస్తూ ఇలా ప్రతీ రోజు ఉదయం చాలా కామ్‌గా సాగిపోతుందని వెల్లడించాడు. ఆ తర్వాత రామోజీఫిలింసిటీకి ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న 'పుష్ప-2' సెట్‌లోకి తీసుకెళ్లాడు.

'భారత్‌లో అభిమానులు చాలా డిఫరెంట్‌. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అభిమానులు కనిపించరు. వీళ్ల అభిమానం మీరు చూడాల్సిందే. వాళ్ల ప్రేమను వివరించడం కష్టం, ‘పుష్ప2’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నా కోసం ఎంతో మంది అభిమానులు వచ్చారు. వీళ్ల ప్రేమ నన్ను సరిహద్దులను అధిగమించేలా చేస్తోంది. నన్ను చూసి వాళ్లు గర్వపడేలా ఉంటాను' అంటూ సెట్‌లోకి ఎంటరయ్యే సమయానికి కారుకు ఇరువైపులా ఉన్న ఫ్యాన్స్‌ను చూపిస్తూ.. వాళ్లను పలకరించాడు. ఆ తర్వాత బన్నీ క్యారెవాన్‌లోకి వెళ్లి.. డైరెక్టర్‌ సుకుమార్‌ను పరిచయం చేయడం.. ఆపై పుష్ప కాస్ట్యూమ్స్‌, మేకపవడం, సీన్‌ను ఒకసారి చదవడం ఇలా కెమెరా ముందుకు వెళ్లే వరకు చేసే ప్రక్రియను చూపించాడు. అంతేకాకుండా పుష్ప-2 మూవీ షూటింగ్ ఎలా సాగుతుందో కూడా ఈ వీడియో బైట్‌లో చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Next Story