బాల‌య్య గారి ఫంక‌న్ కు రావ‌డం స్వీట్ మెమరీ.. ఈనాటి అనుబంధం ఏనాటిదో : అల్లుఅర్జున్

Allu Arjun speech in Akhanda pre release event.నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం అఖండ‌. బోయ‌పాటి శ్రీను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 8:12 AM IST
బాల‌య్య గారి ఫంక‌న్ కు రావ‌డం స్వీట్ మెమరీ.. ఈనాటి అనుబంధం ఏనాటిదో : అల్లుఅర్జున్

నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోంది. డిసెంబ‌ర్ 2న ఈచిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం హైద‌రాబాద్ హైటెక్ సిటీలోని శిల్ప‌క‌ళావేదిక‌లో ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను శ‌నివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని అన్నారు. మా తాత అల్లు రామ‌లింగ‌య్య గారితో బాల‌య్య గారు ఎన్నో చిత్రాల్లో క‌లిసి న‌టించార‌ని..తన తండ్రి అల్లు అరవింద్, బాలయ్య గారు ఒకే జనరేషన్‌ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు అని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, బాలయ్య గారి సినిమాలు చూస్తూ పెరిగానని అల్లుఅర్జున్ చెప్పాడు. తాను బాలయ్య గారి ఫంక్షన్‌కు రావడం స్వీట్ మెమరీ అని తెలిపాడు.

ఇక బోయ‌పాటి శ్రీను త‌న తొలి సినిమా చేయ‌క‌ముందే తెలుస‌ని చెప్పారు. 'భ‌ద్ర' క‌థ త‌న‌కు చెప్పార‌ని.. ఆ సినిమా ఇద్ద‌రం క‌లిసి చేయాల్సింది ఉంద‌ని.. అయితే.. ఆ స‌మ‌యంలో తాను 'ఆర్య' చిత్రం కోసం వెళ్లాన‌న్నారు. ఆ త‌రువాత త‌న కోసం మ‌రో మెట్టు ఎక్కే సినిమా 'స‌రైనోడు' ఇచ్చార‌న్నాడు. ర‌వీంద్ర రెడ్డి నిర్మించిన ప్ర‌తి సినిమా అఖండ‌మైన విజ‌యం సాధించాల‌ని కోరుకున్నారు. ఇక ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ.. శ్రీకాంత్ అన్న‌య్య చాలా సున్నిత‌మైన వ్య‌క్తి.. అయిన‌ప్ప‌టికి విల‌న్‌గా న‌టించారు. ఈ చిత్రం నుంచి కొత్త శ్రీకాంత్‌ను చూడాల‌నుకుంటున్నాన‌న‌ని బ‌న్ని చెప్పారు.

ఇక బాల‌య్య బాబు మాట్లాడుతూ.. త‌మ్ముడు అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వేడుక‌కి హాజ‌రు కావ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. 'ఆఖండ' చిత్రం గురించి తాను ఎక్కువ‌గా చెప్ప‌న‌ని.. ఎలా ఉంటుందో మీరే చూస్తార‌ని తెలిపారు. నటుడు ఏ పాత్ర అయినా చేస్తాడని.. నటన అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమేనని.. శ్రీకాంత్ అలవోకగా నటించారని కొనియాడారు. తొమ్మిది పూజా విధానాల‌కీ, ఈ క‌థ‌కీ సంబంధం ఉంద‌న్నారు. త‌న చిత్రం ఒక్క‌టే కాదు.. 'పుష్ప‌', 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' లాంటి పెద్ద చిత్రాలతో పాటు అన్ని చిత్రాలు విజ‌య‌వంతం కావాల‌ని కోరుకున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి స‌హ‌కారం అందించాల‌ని కోరారు.

Next Story