ఐకాన్ స్టార్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన అర్హ‌.. ఆనందంలో అల్లు అర్జున్‌

Allu Arjun receives 'sweetest welcome' by daughter Arha.పుష్ప చిత్రంతో సూప‌ర్‌డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 3:14 PM IST
ఐకాన్ స్టార్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన అర్హ‌.. ఆనందంలో అల్లు అర్జున్‌

'పుష్ప' చిత్రంతో సూప‌ర్‌డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించింది. ఒక్క పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు అల్లు అర్జున్ పేరు దేశాలు దాటి వినిపిస్తుంది. కొంత‌కాలంగా వ‌రుస‌గా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూ బిజీ ఉన్న బ‌న్నీ.. షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి విదేశాల‌కు వెళ్లారు. దుబాయ్‌లో తీసుకున్న ప‌లు ఫోటోలను అభిమానుల‌తో పంచుకున్నారు. దాదాపు 16 రోజుల త‌రువాత హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

శ‌నివారం ఉద‌యం ఇంటికి వ‌చ్చిన బ‌న్ని.. త‌న కుమారై అర్హ చేసిన ప‌నికి ఫిదా అయిపోయారు. బన్నీకి అర్హ స్వీట్ వెల్కమ్ చెప్పింది. గులాబీ పూల రెక్క‌లు, కొన్ని ర‌కాల ఆకుల‌తో 'వెల్‌క‌మ్ నాన్న' అని గుమ్మం ద‌గ్గ‌ర రాసింది. అది చూసి బ‌న్నీ చాలా ఆనంద‌ప‌డిపోయాడు. ఈ విష‌యాన్ని బ‌న్నీ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. పదహారు రోజుల తరువాత స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ అర్హ రాసిన దాన్ని ఫోటో తీసి షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక పుష్ప చిత్రం సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో అల్లు అర్జున్ కార్యాల‌యంలో సంబ‌రాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బ‌న్ని ని ఆయన పర్సనల్ టీమ్ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కార్యాలయాన్ని ఎర్రచందనం దుంగలను పోలిన దుంగలు, గొడ్డలి, పుష్ప కటౌట్ తో నింపేశారు. అంతేకాదు.. పుష్ప చిత్రానికి సంబంధించిన అంశాలతో ఓ కేక్ ను కూడా సిద్ధం చేశారు. దాని పక్కనే గొడ్డలి, చాకు, కొడవలిని కూడా ఉంచారు. ఆఫీసు గదిలోకి రాగానే ఆ సెటప్ అంతా చూసి బన్నీ విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ ఫోటోల‌ను కూడా బ‌న్నీ షేర్ చేస్తూ AA Family కి థ్యాంక్య్ చెప్పారు.


Next Story