వాయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్‌ రూ.25 లక్షల సాయం

కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలో పునరావాస ప్రయత్నాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన తాజా సినీ ప్రముఖుడు అల్లు అర్జున్.

By అంజి  Published on  4 Aug 2024 3:00 PM IST
Allu Arjun, Wayanad , Kerala, Tollywood

వాయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్‌ రూ.25 లక్షల సాయం

కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలో పునరావాస ప్రయత్నాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMDRF)కి విరాళం అందించిన తాజా సినీ ప్రముఖుడు అల్లు అర్జున్.

జులై 30 తెల్లవారుజామున జిల్లాలో సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 219కి చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఎక్స్‌ పోస్ట్‌లో అల్లు అర్జున్ తనకు ఎప్పుడూ చాలా ప్రేమను ఇచ్చే రాష్ట్రం కోసం.. ఈ కష్ట సమయంలో తన వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

''వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం వల్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎప్పుడూ నాకు చాలా ప్రేమను ఇస్తోంది. పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాను'' అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మలయాళ సినీ ప్రముఖుడు మోహన్‌లాల్ శనివారం తన ఆర్మీ యూనిఫాంలో వయనాడ్‌కు చేరుకుని విపత్తులో చిక్కుకున్న ప్రాంతంలో పునరావాస పనుల కోసం రూ.3 కోట్లను విరాళంగా ఇచ్చారు.

"వయనాడ్‌లో జరిగిన విధ్వంసం ఒక లోతైన గాయం, అది నయం కావడానికి సమయం పడుతుంది. పోయిన ప్రతి ఇల్లు, జీవితానికి అంతరాయం కలగడం వ్యక్తిగత విషాదం" అని ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మెప్పాడిలోని ఆర్మీ క్యాంపుకు చేరుకున్న నటుడు, అధికారులతో కొద్దిసేపు చర్చించి, ఇతరులతో కలిసి కొండచరియలు విరిగిపడ్డ స్థలానికి బయలుదేరారు.

ఇప్పటికే తమిళ నటులు కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తీ, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, ఇతర మలయాళ తారలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా, టోవినో థామస్ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMDRF) విరాళాలు ఇచ్చారు.

కమల హాసన్ రూ.25 లక్షలు, జ్యోతిక, సూర్య, కార్తీ కలిసి రూ.50 లక్షలు విరాళంగా అందించారు. మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ రూ.15 లక్షలు, టోవినో రూ.25 లక్షలు విరాళంగా అందించారు. ఫహద్, నజ్రియా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ప్రముఖ చిత్రనిర్మాత ఆనంద్ పట్వర్ధన్ ఇటీవల ముగిసిన 16వ అంతర్జాతీయ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IDSFFK)లో ప్రైజ్ మనీగా పొందిన రూ.2.2 లక్షలను విరాళంగా ఇచ్చారు.

Next Story