రోడ్డు పక్కన హోటల్‌లో టిఫిన్ చేసిన బన్నీ.. వీడియో వైరల్
Allu Arjun breakfast at Rod side tiffin centre.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్
By తోట వంశీ కుమార్ Published on
13 Sep 2021 7:56 AM GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సమీపలోని మారేడుపల్లిలో జరుగుతోంది. మరో 10 రోజుల పాటు కాకినాడ, మారేడుపల్లి ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. ఇదిలా ఉంటే.. బన్నీ అక్కడి వంటలను ఆస్వాదిస్తున్నారు. తాజాగా రోడ్ పక్కనే ఉన్న ఓ హోటల్‌లో టిఫిన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గోకవరం దగ్గరి ప్రాంతం లో బన్నీ ఇలా టిఫిన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బన్నీ చాలా సింపుల్ గా ఉండటం అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాక అక్కడి వారికి బన్నీ టిప్ ఇచ్చారు. ఇక పుష్ప చిత్రంలో బన్ని సరసన రష్మిక నటిస్తోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పుష్ప ది రైజ్ అంటూ తొలి భాగం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తోంది. ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. దేశీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story