ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాపై భారీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అధికారికంగా వెల్లడైంది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై ఈ మూవీ రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ బన్నీకి విషెస్ చెప్పగా, అదే వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. AA22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన అనౌన్స్‌మెంట్ చేస్తూనే ఓ అదిరిపోయే వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం.
కాగా పుష్ప మూవీతో జాతీయ అవార్డును అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2 కూడా భారీ విజయం నమోదు చేసుకుంది. దీంతో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ ప్రాజెక్టు చేస్తుండటంపై ఆయన ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.