ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. ఇక ఆయనకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. తాజాగా అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.
ఈ పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే'.. అంటూ పుష్ప డైలాగ్‌తో ఉత్సాహపరిచాడు. ఇండియన్‌గా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. అల్లు అర్జున్‌కు అక్కడి మేయర్ ఆడమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఇండియా పరేడ్‌కి అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమానికి 1,50,000 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.