అల్లు అర్జున్‌-అట్లీ.. మూవీ టైటిల్‌ ఇదే..!

అల్లు అర్జున్, అట్లీల కలయికలో రాబోతున్న చిత్రానికి రాకా అని టైటిల్ పెట్టారు.

By -  Medi Samrat
Published on : 8 April 2026 1:12 PM IST

అల్లు అర్జున్‌-అట్లీ.. మూవీ టైటిల్‌ ఇదే..!

అల్లు అర్జున్, అట్లీల కలయికలో రాబోతున్న చిత్రానికి రాకా అని టైటిల్ పెట్టారు. బుధవారం 44వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్న అల్లు అర్జున్ ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో ఆయన ఒక రాక్షస అవతారంలో కనిపిస్తున్నారు. అతని కాటుక కళ్ళు, ఉన్ని దుస్తులలోంచి బయటకు పొడుచుకు వచ్చిన పెద్ద పంజా అతని భయానక స్వభావాన్ని సూచిస్తున్నాయి.


చిత్ర నిర్మాతలు ఈ పోస్టర్‌ను హిందీ, ఇంగ్లీషుతో పాటు మరో ఐదు ప్రాంతీయ భాషలతో కలిపి తొమ్మిది విభిన్న భాషల్లో విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. పోస్ట‌ర్ కింద‌ క్యాప్షన్‌లో "పరిమితులకు అతీతమైన దృశ్యం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాను ఏప్రిల్‌లో అల్లు అర్జున్ 43వ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌, అట్లీకి మధ్య ఇది ​​మొదటి సినిమా కావ‌డం విశేషం. అట్లీ త‌న చివ‌రి సినిమా జ‌వాన్‌తో భారీ హిట్ కొట్ట‌గా.. అల్లు అర్జున్ పుష్ప‌-2తో భాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాడు.

Next Story