రణబీర్ కపూర్ కాకుండా ఆలియా భట్ ఫేవరెట్ నటులు వీరే..

Alia Bhatt’s favourite actors. ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

By Medi Samrat  Published on  3 April 2022 3:48 PM IST
రణబీర్ కపూర్ కాకుండా ఆలియా భట్ ఫేవరెట్ నటులు వీరే..

ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆలియా భట్ సినిమాలు భారీ హిట్ ను సొంతం చేసుకుంటూ వెళుతున్నాయి. గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక ఆమె తన వృత్తిపరమైన జీవితంతో పాటు.. బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్‌తో తన పెళ్లి గురించి కూడా ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రేమపక్షులు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ఇక ఆమె అభిమాన నటుల జాబితాలో మొదటి పేరు ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ ది కాగా.. రణబీర్ కాకుండా మరో ఇద్దరు పేర్లు జాబితాలో ఉన్నాయి. ఆమె చెప్పిన పేర్లు రణవీర్ సింగ్, అల్లు అర్జున్. ఆలియా రణ్‌వీర్ సింగ్‌తో కలిసి గల్లీ బాయ్‌లో కనిపించింది. కరణ్ జోహార్ తర్వాతి చిత్రం "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ"లో కూడా అతనితో కలిసి పని చేస్తోంది. వీరి ఆన్‌స్క్రీన్ జోడీ అభిమానులకు ఇప్పటికే నచ్చింది. రణబీర్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర షూటింగ్ ముగిసింది.

అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్‌లో ముంబైలో వివాహం చేసుకోబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతూ ఉంది. వారు పెళ్లి వేడుక RK హౌస్ లో జరుగుతుందని అంటున్నారు. ఆ వేదికను రణబీర్ స్వయంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ తన అమ్మమ్మ కృష్ణ రాజ్ కపూర్‌తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతని తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ జనవరి 20, 1980న RK హౌస్‌లో వివాహం చేసుకున్నారు. అందువల్ల, రణబీర్ కూడా చెంబూర్ ఇంట్లో వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. 450 మంది అతిథుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.













Next Story