మొన్న ర‌ష్మిక‌.. నేడు అలియాభట్.. నెక్ట్స్‌..?

రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ తర్వాత అలియా భట్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Medi Samrat  Published on  27 Nov 2023 8:15 PM IST
మొన్న ర‌ష్మిక‌.. నేడు అలియాభట్.. నెక్ట్స్‌..?

రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ తర్వాత అలియా భట్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలియా ముఖంతో మార్ఫింగ్ చేసిన వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఇది ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ వీడియోలో అలియా భట్ ముఖం వేరే మహిళ మీద ఉంచారు. డీప్‌ఫేక్ గురించి ఇటీవలి కాలంలో చాలా చర్చ జరుగుతూ ఉండగా.. ఇప్పుడు అలియా భట్ కు సంబంధించిన మానిప్యులేట్ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. నీలిరంగు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి కెమెరా ముందు ఉండడాన్ని వీడియోలో చూడొచ్చు.

రష్మిక మందన్నా సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో ఇటీవల వైరల్ అయిన విష‌యం తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్ని రోజుల క్రితం.. కాజోల్ కు సంబంధించిన మానిప్యులేట్ వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. ఒరిజినల్ క్లిప్‌లో ఉన్నది ఇన్‌ఫ్లుయెన్సర్ రోసీ బ్రీన్. డీప్‌ఫేక్‌లో బ్రీన్ ముఖం కాజోల్‌తో భర్తీ చేశారు.

వృత్తిపరంగా, అలియా భట్ ప్రస్తుతం వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ చిత్రం 'జిగ్రా' లో నటిస్తోంది. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఆమె చివరిసారిగా రణవీర్ సింగ్‌తో కలిసి కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో తెరపై కనిపించింది.

Next Story