అలియా కుటుంబంలో విషాదం

ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అలియాభట్‌ తాత నరేంద్రనాథ్‌ రాజ్‌దాన్‌ కన్నుమూశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2023 5:30 PM IST
Alia Bhatt, Narendranath Razdan, Bollywood

అలియా కుటుంబంలో విషాదం 

ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అలియాభట్‌ తాత నరేంద్రనాథ్‌ రాజ్‌దాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అస్వస్థతకు లోనైన నరేంద్రనాథ్‌ను కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించి చికిత్సనందిస్తుండగా.. ఇవాళ తుది శ్వాస విడిచారు. నటి సోని రాజ్‌దాన్‌ (డైరెక్టర్‌ మహేశ్ భట్ సతీమణి) ఈ విషయాన్ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు. అలియా భట్ కుటుంబ సభ్యులు ఈ విషాద వార్తను పంచుకున్నారు.

వర్క్ పరంగా.. అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్రలో ఇటీవల కనిపించింది. ఈ నటి తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో తళుక్కుమననుంది. ఈ చిత్రం కోసం రణవీర్ సింగ్‌తో మళ్లీ జతకట్టింది. అంతకు ముందు ఇద్దరూ గల్లీ బాయ్ సినిమాలో నటించారు. ఈ చిత్రం జూలై 28, 2023న విడుదల కానుంది.

Next Story