కేవలం 28 మంది గెస్ట్ ల మధ్యనే పెళ్లి..!

Alia Bhatt and Ranbir Kapoor's wedding to have only 28 guests. అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మెనూ నుండి వివాహ అతిథుల జాబితా వరకు

By Medi Samrat  Published on  11 April 2022 8:45 PM IST
కేవలం 28 మంది గెస్ట్ ల మధ్యనే పెళ్లి..!

అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మెనూ నుండి వివాహ అతిథుల జాబితా వరకు, ప్రజలు అన్నింటినీ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అలియా సోదరుడు, రాహుల్ భట్ వివాహానికి సంబంధించిన కీలక వివరాలను మీడియాతో పంచుకున్నారు. అలియా భట్ - రణబీర్ కపూర్ల వివాహానికి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఈ వివాహానికి 28 మంది అతిథులు మాత్రమే హాజరవుతారని, అందులో ఎక్కువగా కుటుంబ సభ్యులే ఉంటారని రాహుల్ భట్ చెప్పారు. అతిథులంతా బస్సులో చెంబూరుకు వెళ్తారు. ముంబైలోని చెంబూర్‌లో ఈ జంట పెళ్లి చేసుకోబోయే ఆర్కే హౌస్ ఉంది. రాహుల్ భట్.. మహేష్ భట్- కిరణ్ భట్ ల కుమారుడు, పూజా భట్ అతని అక్క. అలియా మహేష్ భట్ రెండవ భార్య సోని రజ్దాన్ కుమార్తె. అయితే ఆ కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటాయి.

అలియా భట్- రణబీర్ కపూర్ ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు వ్యాపించాయి. తరువాత, ఈ జంట ముంబైలోని చెంబూర్‌లోని ఆర్‌కె హౌస్ లో పెళ్లి చేసుకోవచ్చని తెలిసింది. రణ్‌బీర్ మరియు అలియా పెళ్లిని ఎక్కడ నిర్వహించాలనే దానిపై అన్ని చాయిస్ లను చూశారు. ప్రస్తుతానికి, రణబీర్ బాంద్రా హోమ్, వాస్తులో పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. వివాహ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలని భావిస్తున్నారు. ఇద్దరు నటీనటులు తమ సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులను వివాహానికి ఆహ్వానించారు.














Next Story