రెండోసారి కరోనా బారిన పడ్డ అక్షయ్‌ కుమార్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి దూరం

Akshay Kumar to miss Cannes red carpet after testing COVID-19 positive for second time.బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 15 May 2022 9:47 AM IST

రెండోసారి కరోనా బారిన పడ్డ అక్షయ్‌ కుమార్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి దూరం

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న 75వ కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివ‌ల్ కు దూరం అయ్యారు. గ‌తేడాది ఏప్రిల్‌లోనూ అక్ష‌య్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

'కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022కోసం ఎంతో ఎదురుచూశాను. కానీ కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నా. ప్ర‌స్తుతం విశాంత్రి తీసుకుంటున్నా. టీం అందరికీ శుభాంకాంక్షలు 'అంటూ అక్ష‌య్ కుమార్ ట్వీట్‌ చేశారు.

నయనతార, తమన్నా, ఏఆర్‌ రెహమాన్‌, ఆర్‌ మాధవన్‌,నవాజుద్దీన్ సిద్దిఖీ, శేఖర్ కపూర్, సీబీఎఫ్‌సీ చీఫ్ ప్రసూన్ జోషి, రిక్కీ కేజ్ త‌దిత‌ర సెలబ్రిటీలు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై నడవనున్నారు. వీరితో పాటు అక్ష‌య్ కుమార్ కూడా ఈ ఈ వెంట్‌లో పాల్గొనాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఈవెంట్‌కు దూరం అయ్యారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. అక్షయ్ కుమార్ త్వరలో యష్ రాజ్ ఫిల్మ్స్ పిరియడ్ డ్రామ్ 'పృథ్వీరాజ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Next Story