కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున‌

Akkineni Nagarjuna receives covid 19 vaccination.మ‌న్మ‌థుడు, కింగ్ నాగార్జున కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 5:36 AM GMT
Akkineni Nagarjuna receives covid 19 vaccination

క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో విడ‌త క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు పై బ‌డి దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఈ రెండో ద‌శ‌లో టీకాలు వేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, సామాన్య ప్ర‌జ‌లు వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఇక మ‌న్మ‌థుడు, కింగ్ నాగార్జున కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

'నిన్న నేను కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుని, టీకా వేయించుకోవాలి' అని నాగార్జున ట్వీట్ చేశారు.

కింగ్ నాగార్జున 60 ప్లస్ లోనూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వరుస షూటింగులతో బిజీగా ఉన్నారు. రెగ్యులర్ జిమ్ ఫిట్నెస్ తో ఆయన అన్నివేళలా హెల్దీ లైఫ్ స్టైల్ తో ఎంతో జాగ్రత్తగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Next Story