అక్కినేని నాగచైతన్య 24వ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య- కార్తిక్ దండు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్‌ను ఆదివారం ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 23 Nov 2025 11:30 AM IST

Cinema News, Tollywood, Entertainment, Akkineni Naga Chaitanya, Vrushakarma

అక్కినేని నాగచైతన్య 24వ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య- కార్తిక్ దండు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్‌ను ఆదివారం ప్రకటించారు. ఇవాళ నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌​తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్​ రివీల్ చేశారు. సూపర్‌​స్టార్ మహేశ్ బాబు ఈ సినిమా పోస్టర్‌​ను వర్చువల్‌​గా లాంచ్ చేశారు. ఈ సినిమాకు 'వృషకర్మ' అనే టైటిల్ ఖరారు చేశారు. వృషకర్మ అంటే ధర్మమైన పనులు చేసేవాడని అర్థం.

కాగా, ఈ సినిమాను డైరెక్టర్ కార్తిక్ మైథలాజికల్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు.'లాపతా లేడీస్' యాక్టర్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. 'కాంతారా' ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story